రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపుగా మూడు నెలలు గడిచి పోయింది. ఇప్పటికీ రష్యా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. బలమైన రష్యా ముందు కేవలం వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంత అనుకున్నప్పటికీ రష్యాకు ఎదురొడ్డి పోరాడుతుంది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు సైనికంగా, వ్యూహాత్మకంగా సాయపడడం తో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురునిలిచి పోరాడుతుంది.
ఇదిలా ఉంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా చేయడానికి సిద్ధం అయ్యాయి. అయితే రష్యా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వద్దని రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ శనివారం ఇరుదేశాలను హెచ్చరించారు. ఇది ఉక్రెయిన్ లోని పరిస్థితిని మరింత అస్థిరపరిచే చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న పరిస్థితిని మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.