ట్రెండ్ ఇన్: రజనీకాంతా మజాకా..Thalaivar169లో నవ్వులు పూయించనున్న సూపర్ స్టార్..!

-

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్..కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు జనాలు పండుగ చేసుకుంటారు. తమిళ నాట అయితే రజనీకాంత్ దేవుడని అభిమానులు కొలుస్తుంటారు. రజనీకాంత్ చివరగా సినీ ప్రేక్షకులను ‘పెద్దన్న’గా పలకరించాడు.

శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా అయిన నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. రజనీకి చెల్లెలిగా ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది. కాగా, రజనీ నెక్స్ట్ ఫిల్మ్ అప్ డేట్ కోసం అశేష అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ తన 169వ చిత్రం చేయనున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు హ్యష్ ట్యాగ్ తలైవర్ 169 #Thalaivar169 పెట్టి.. వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో కొద్ది సేపు ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఈ పిక్చర్ ను సన్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తుండగా, యాక్షన్ ఫిల్మ్ గా రాబోతున్నదని తెలుస్తోంది. నెల్సన్ మార్క్ కామెడీ జోడించి చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ లో తెరకెక్కించున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపైన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

ఓ వైపు రజనీ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఇరగదీస్తూనే మరో వైపున నవ్వులు పూయించేలా పాత్రను నెల్సన్ దిలీప్ చేసినట్లు సమాచారం. రజనీకాంత్ గత కొద్ది కాలంగా వెండితెరపైన ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ ప్లే చేయలేదు. కాగా, ఈ సారి ‘తలైవర్ 169’లో పూర్తి స్థాయి నవ్వులు పూయించనున్నట్లు కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news