రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని తొలుత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే తెలంగాణలోని అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీలు 776, ఎమ్మెల్యేలు 4,033 ఉన్నారు. మొత్తం ఓటర్లు 4,809 మంది ఉన్నారు.

ద్రౌపది ముర్ము-యశ్వంత్ సిన్హా
ద్రౌపది ముర్ము-యశ్వంత్ సిన్హా

తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్..

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ మాక్ పోలింగ్ నిర్వహించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఈ మేరకు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత బస్సుల్లో నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేయనున్నారు.