ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ వెన్ను పోటు పొడిచారని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని మోడీ స్వయంగా మాట ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అలాంటి వాళ్లను ఎత్తి పట్టుకున్నారు. అలాంటి వారితో పొత్తులు పెట్టుకున్నారు టీడీపీ, జనసేన పార్టీలు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. మోడీ విశాఖపట్నం కు వచ్చారు. వీరు ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట అయినా మాట్లాడారా..? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన ప్రధాని మోడీ తో సీఎం చంద్రబాబుది సక్రమ సంబంధం అయితే మాజీ సీఎం జగన్ ది అక్రమ సంబంధం అని విమర్శించారు షర్మిల. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక ఫ్యాకేజీ పై నోరెత్తకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. మన బిడ్డలకు ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తామన్నారు. మన బిడ్డలకు ఒక లక్ష కూడా ఇవ్వలేదు. ఒక్క మాట అయినా మాట్లాడారా.. విశాఖ స్టీల్ ఆంధ్రకు చాలా ముఖ్యమని చెప్పారా..? అని ప్రశ్నించారు.