స్వామి వివేకానంద 159వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం 25వ నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే తన ప్రసంగం కోసం దేశవ్యాప్తంగా యువతీయువకుల నుంచి సలహాలు, సూచనలను కోరారు. యువత సలహాలు, సూచనలను ప్రధాని తన ప్రసంగంలో జోడించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
నేషనల్ యూత్ ఫెస్టివల్‌కు దేశంలోని ప్రతి జిల్లా నుంచి కూడా యువతీయువకులు పాల్గొననున్నారు.
యూత్ ఫెస్టివల్‌లో భాగంగా జనవరి 13న నేషనల్ యూత్ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. దేశంలోని విభిన్న సంస్కృతులను ఏకతాటికి తీసుకురావడం, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే భావంలో అందరినీ ఏకీకృతం చేయాలనే లక్ష్యంతో సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు.