అర్ధరాత్రి ఆర్టీసీకి ఓ యువతి ట్వీట్..యాక్షన్‌ తీసుకున్న సజ్జనార్

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ గా సజ్జనార్‌.. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి.. ఆర్టీసీ సంస్థ లాభాల్లో దూసుకుపోతుంది. అనేక రకాలైన ఆఫర్లతో… ప్రయాణికులను ఆర్టీసీ వైపునకు మళ్లీస్తున్నారు ఎండీ సజ్జనార్‌. ఇది ఇలా ఉండగా.. అర్ధరాత్రి ఆర్టీసీకి ఓ యువతి ట్విట్టర్‌ వేదికగా ఫిర్యాదు చేయగా… దానిపై వెంటనే యాక్షన్‌ తీసుకుని.. అందరినీ షాక్‌ గురి చేశారు ఎండీ సజ్జనార్.

అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో ఆపాలనే రూల్‌ మొదటి నుంచి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాద్‌ కు చెందిన పాలే నిషా అనే యువతి… ఆర్టీసీ బస్సులను 10 నిమిషాలు బస్సు ఆపాలని కోరింది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్‌ లో ఆర్టీసీకి ఫిర్యాదు చేసింది యువతి. దీంతో అర్ధరాత్రి చేసిన ఆ యువతి ట్వీట్ కి స్పందించారు ఎండి సజ్జనార్. ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు రిప్లయ్ ఇచ్చారు సజ్జనార్. ఇక అటు అర్ధరాత్రి సైతం మహిళ సమస్య పై సజ్జనార్ స్పందించడంతో ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపారు పాలే నిషా.

Read more RELATED
Recommended to you

Latest news