డ్రగ్ టెస్ట్ చేయించుకున్న ఫిన్‌ల్యాండ్ ప్రధాని.. ఎందుకంటే?

-

ఫిన్‌ల్యాండ్ ప్రధానమంత్రి సన్నా మారిన్ డ్రగ్ టెస్ట్ చేయించుకున్నారు. ఇటీవల తన ఫ్రెండ్స్ తో పార్టీలో పాల్గొన్న ఆమె డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలో ప్రధాని సన్నా మారిన్ డ్రగ్ తీసుకున్నట్లు ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు ఎదురయ్యాయి. డ్రగ్ తీసుకున్నందుకే ప్రధాని మారిన్ చిందులేశారని ఆరోపించారు. ఈ క్రమంలో తానేమి డ్రగ్ తీసుకోలేదని ఫిన్‌ల్యాండ్ ప్రధాని మారిన్ తెలిపారు. దీని కోసం డ్రగ్ టెస్ట్ కూడా చేయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.

ఫిన్‌ల్యాండ్ ప్రధాని
ఫిన్‌ల్యాండ్ ప్రధాని

కాగా, ఇటీవల ప్రధాని మారిన్ తన స్నేహితులతో పార్టీ చేసుకున్నారు. ఈ వీడియోలో ఆమె డ్యాన్స్ చేసిన చేసింది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ప్రతిపక్షాల ట్రోలింగ్‌కు ప్రధాని గురయ్యారు. కూటమి పార్టీలతోపాటు ప్రతిపక్షాలు డ్రగ్ టెస్టుకు డిమాండ్ చేశారు. కాగా, 2019 డిసెంబర్‌లో ప్రపంచంలోనే యువ ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news