సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సతీసమేతంగా కలిసిన ఏపీ సీఎం

-

మరి కాసేపట్లో బహుళ అంతస్థుల కోర్టు సముదాయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యం లోనే… ముఖ్య అతిథిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి జగన్.. తన సతీమణి వైఎస్ భారతి తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణను కలిశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణను సన్మానించారు వైఎస్‌ జగన్‌ దంపతులు.

ఇక అటు బహుళ అంతస్థుల కోర్టు ప్రాంగణానికి హైకోర్టు సీజే జస్టిస్ పీకే మిశ్రా, న్యాయమూర్తులు, న్యాయాధికారులు చేరుకున్నారు. 3.70 ఎకరాల ప్రాంగణంలో బహుళ అంతస్థుల భవన కోర్టు సముదాయం ఏర్పాటు చేయనున్నారు. రూ.92.60 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. 8 అంతస్థుల భవన సముదాయంలో మొత్తం 29 కోర్టు హాళ్ళు ఉండనుండగా.. ఒక్కో అంతస్థు విస్తీర్ణం 33వేల చదరపు అడుగులు ఉండనుంది. 8 వ అంతస్తులో 200 మంది సభ్యుల సామర్థ్యంతో ఆడిటోరియం, మీటింగ్ హాల్ ఉండేలా బహుళ అంతస్థుల కోర్టు సముదాయాన్ని నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news