ఐపీఎల్ 2022 లో భాగంగానే నేడు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య 15 వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (4) తో నిరాశ పర్చాడు. కానీ మరో ఓపెనర్ పృథ్వీ షా (61) రాణించాడు. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. పావెల్ (3) కూడా చేతులేత్తేశాడు.
దీంతో రిషబ్ పంత్ (39 నాటౌట్) సర్ఫరాజ్ ఖాన్ ( 36 నాటౌట్) నిలకడగా రాణించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి.. 149 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు.. రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ తీసుకున్నారు. కా లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించాలంటే.. 150 పరుగులు చేయాల్సి ఉంటుంది. లక్నో బ్యాటింగ్ ఆర్డర్ ముందు ఈ టార్గెట్ చిన్నబోయే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ కెఎల్ రాహుల్, డి కాక్ తో పాటు వరస హాఫ్ సెంచరీలతో జోరు మీద ఉన్న దీపక్ హుడలు రాణిస్తే. విజయం లక్నోదే అవుతుంది.