భారత యువ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఇంగ్లాండ్‌కు వెళ్లి మరోసారి టెస్టు జట్టుతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌కు సన్నద్ధమవుతుండగా.. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పరిమిత ఓవర్ల జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. శ్రీలంక పర్యటనలో భాగంగా టీమ్‌ఇండియా 3 టెస్టులు, 3 టీ 20లు ఆడనుంది.
అయితే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఆడేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనలో ఉన్న మరో ఓపెనర్ పృథ్వీ షాను ఇంగ్లాండ్‌కు పంపించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇంగ్లాండ్ టూర్ కు వెళ్ళిన జట్టులో గిల్‌కు బ్యాకప్ గా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అభిమన్యు ఈశ్వరన్‌లు ఉన్నారు. రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోండగా.. అభిమన్యు ఈశ్వరన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఇంకా అర్రంగేట్రం చేయలేదు. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా ఇంగ్లాండ్‌కు వెళ్తే జట్టుకు సౌకర్యంగా ఉంటుందని జట్టు యాజమాన్యం భావిస్తోన్నట్లు సమాచారం.