తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన

-

ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ శుక్ర, శనివారాలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాలకుర్తిలో, మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్నాబాద్‌లో, సాయంత్రం మూడు గంటలకు కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. రేపు రాత్రి ప్రియాంక గాంధీ ఖమ్మంకు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేయనున్నారు. 25న ఉదయం 11:00 గంటలకు ఖమ్మం, పాలేరులో ప్రచారం నిర్వహించనున్నారు.

Rahul Gandhi, Priyanka Vadra to kickstart Congress poll campaign in Telangana from October 18

ఆ తర్వాత అక్కడి నుంచి సత్తుపల్లి చేరుకుని.. మధ్యాహ్నం 1:30కి అక్కడ ప్రచారం చేయనున్నారు. అనంతరం 2: 40 నుండి 3:30 వరకు మధిర ప్రచార సభలో ప్రియాంక పాల్గొననున్నారు. సభ అనంతరం.. అక్కడి నుండి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు కొత్తగూడెంలో ప్రియాంక గాంధీ రోడ్ షోలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో, ప్రజా భేరి సభలో ప్రియాంక గాంధీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొననున్నారు. ఓల్డ్ డిపో నుంచి త్రీ టౌన్ వరకు రోడ్ షో నిర్వహంచనున్నారు. రేపు రాత్రి ఖమ్మంలో ప్రియాంక గాంధీ బస చేయనున్నారు. ఎల్లుండి పాలేరు, ఖమ్మం వైరా, మధిర నియోజకవర్గాలల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news