మీరు తింటున్న వాటిలో అవి ఉండాల్సిందే

-

కరోనా వ్యాప్తి ప్రారంభంతో ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంపై దృష్టి సారిస్తున్నారు. విటమిన్‌ సీ,డీ లను పెంపొందించుకునేందుకు అనేక రకాల ఆహార పదర్థాలను తీసుకుంటున్నారు. కణజాల నిర్మాణం, యాంటీబాడీల వ్యవస్థ మొత్తం ప్రోటీన్లపైనే ఆధారపడి ఉంటుటంది. ఏమాత్రం పోటీన్లు తగ్గిన అలసట, బలహీనత వస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహార పదర్థాల్లో ఎక్కువగా పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలని వైద్యులు పదేపదే సూచిస్తున్నారు. వీటిలో శాఖహార పోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. పప్పులు తీసుకోవడంతో చాలా ప్రయోజనాలు ఉన్నావి. ముఖ్యంగా పేగుల ఆరోగ్యానికి కూడా సహకరిస్తాయి.

 

మనం పప్పు పదర్థాలు తీసుకున్నప్పుడు అందులోని పోషకాలను ముందు చిన్న పేగులు గ్రహించిన తర్వాత జీర్ణం కాని పిండి పదర్థాలు పెద్ద పేగుగు చేరుకుంటాయి. అక్కడున్న బ్యాక్టీరియాలు పులిసిపోయేలా చేసి కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. శనగ బఠానీల పప్పులలోని ‘రాఫీనోస్‌’ ‘స్టాకీయోజ్‌’ లాంటి పిండి పదర్థాలను బ్యాక్టీరియా విచ్ఛినం చేసేక్రమంలో కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల అవుతుంది. ఇది పేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చేందేందుకు సహకరిస్తుంది. ఇలా పప్పులు మన శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. మనం పూర్తిస్థాయిలో వీటి నుంచి ప్రయోజనాలు పొందాలంటే వండే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే అవి సాధ్యమంటున్నారు.

నానా బెట్టడం ముఖ్యం..

పప్పు దినుసులు వండేటప్పుడు శుభ్రంగా కడగాలి. ముందుగానే కాసేపు నానబెట్టడం చాలా మంచిది. వాటిలో సోపోనిన్స్‌కు చెందిన రసాయనాలు ఉండటంతో ఉడేకేటప్పుడు, కడిగేక్రమలో ఓ రకం నూరగ వస్తుంది. అది ఆరోగ్యానికి హానికరం. పప్పులను శుభ్రంగా కడగడం, బాగా నానబెట్టడంతో దాన్ని తొలగించవచ్చు. పప్పులను 45 సెంటీగ్రెడ్‌ వేడినీటిలో నానబెట్టడంతో పోషకాలు అధికంగా లభిస్తాయి. పప్పులంనింటినీ దాదాపుగా 20–35 నిమిషాలు నానా బెడితే చాలా మంచిది. పెసర పప్పును అంతగా నానబెట్టడం అవసరం లేదు. రెండు, మూడు సార్లు కడిగితే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news