పెరుగు తినని వాళ్ళు ఏమేమి మిస్ అవుతున్నారో ఒక్కసారి తెలుసుకోండి.

-

పెరుగు.. దక్షిణాదిన జనాలందరూ భోజనం చేసేటపుడు ఖచ్చితంగా తీసుకునే ఆహారం. ఉత్తరాదిన పెరుగుకి అంత ప్రాముఖ్యం ఉంటుందా అంటే సందేహమే. పెద్ద పెద్ద హొటళ్ళు సైతం తమ భోజనంలో పెరుగును ఉంచకపోవడం ఈ సందేహానికి కారణం అని చాలా మంది చెబుతుంటారు. అదలా ఉంచితే, పాల నుండి వచ్చే పెరుగు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు తింటే పొడుగ్గా పెరుగుతారని, చిన్న పిల్లలకి పెరుగుని అలవాటు చేస్తారు. ఐతే కొంతమంది పెరుగు తినడానికి ఇష్టపడరు. పెరుగుని ఇష్టపడకపోవడం వల్ల వారేం మిస్సవుతున్నారో ఇక్కడ చూద్దాం.

ఆహారాన్ని జీర్ణం చేయడంలో పెరుగు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇందులో ఉండే బాక్టీరియా కారణంగా ఆహారం త్వరగా జీర్ణమై పొట్టని శుభ్రం చేస్తుంది. అందుకే పొట్టలో గడబిడగా ఉన్నప్పుడు పెరుగు తినమని సలహా ఇస్తారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కరోనా టైమ్ లో రోగనిరోధక శక్తి పెరగడం ఎంత ఆవశ్యకమో చెప్పాల్సిన పనిలేదు.

చర్మాన్ని తేమగా ఉంచడంలో పెరుగు చాలా పనిచేస్తుంది. చనిపోయిన చర్మకణాలను తొలగించి చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది.

రక్తపీడనాన్ని(బీపీ) తగ్గిస్తుంది. ఎక్కువ కొవ్వు లేని పెరుగుని ఆహారంలో భాగం చేసుకుంటే రక్తపీడనం కంట్రోల్ లో ఉంటుందని అమెరికా పరిశోధన సంస్థ తేల్చింది.

ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎముకలు గట్టిపడడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే పెరుగుని రెగ్యులర్ గా ఆహారంలో తీసుకోవడం మంచిది.
పెరుగు తినని వాళ్ళు ఈ లాభాలన్నీ మిస్ అవుతున్నట్లే లెక్క. సో.. ఇకనైనా ఆహారంలో పెరుగుని భాగం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news