డిగ్రీ పాఠ్యపుస్తకంలో పునీత్ జీవిత చరిత్ర.. సలాం కొడుతున్న ఫ్యాన్స్.!!

-

శాండిల్ వుడ్ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన అతి చిన్న వయసులోనే మరణించారు. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మయ్ తో పాటు మాజీ సీఎంలు, మంత్రులు అందరూ కూడా పునీత్ రాజ్ కుమార్ కి అంతిమ వీడుకోలు పలికారు. అయితే పవర్ స్టార్ కర్ణాటక రత్న డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్ర కన్నడ పాఠ్యపుస్తకంలో పొందుపరచాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు డాక్టర్ పునీత్ రాజకుమార్ అభిమానుల సంఘాలు కర్ణాటక ప్రభుత్వానికి లేక కూడా రాసాయి.

ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని కలిసిన పునీత్ రాజ్ కుమార్ అభిమాన సంఘాలు ఆయనకు వినతి పత్రం కూడా సమర్పించారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ అభిమానుల కోరిక నెరవేరింది బెంగళూరు విశ్వవిద్యాలయం తన డిగ్రీ బీకాం మూడవ సెమిస్టర్ లో కన్నడ భాష కోర్స్ వాణిజ్య కన్నడ 3 లో పునీత్ జీవితంలో నుండి ఒక సారాంశాన్ని పొందుపరిచింది. అంతకుముందు బెంగళూరు యూనివర్సిటీ తన గ్రాడ్యుయేషన్ థీసీస్ లో శరణు హాళ్ళూర్ రాసిన నేనే రాజ్ కుమార్ లోని లోహిత్ ఎంబా మరిముడు అధ్యయనాన్ని ఉపయోగించింది.. డాక్టర్ మునియప్ప ఈ పాఠ్య పుస్తకానికి ప్రధాన సంపాదకులు.

ప్రస్తుతం సంవత్సరం డిగ్రీ బీకాం మూడవ సెమిస్టర్ విద్యార్థులు కన్నడ భాషలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బాల్యం గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు యూనివర్సిటీ కర్ణాటక రత్న డాక్టర్ పునీత రాజ్ కుమార్ జీవిత చరిత్రను డిగ్రీ పాఠ్యపుస్తకాలలో ప్రచురించడంతో ఆయన అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు బెంగళూరు యూనివర్సిటీకి.. కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు ఆయన అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news