పంజాబ్ లో కొత్త పార్టీ.. తన పార్టీ పేరు వెల్లడించనున్న అమరీందర్ సింగ్..!

-

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారు. తన వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా నేడు పార్టీ పేరు వెల్లడించే అవకాశం ఉంది. విలేకరుల సమావేశంలో నేడు పార్టీ పేరును వెల్లడించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంజాబ్ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ తనను అవమానించిన కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టే వ్యూహంతో అమరీందర్ అడుగులు వేస్తున్నారు. గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్ ను తప్పించి చన్నీకి పంజాబ్ సీఎం పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.

దీంతో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్న అమరీందర్ పలు మార్లు బీజేపీ నేతలను ఢిల్లీలోొ కలుసుకున్నారు. మొదట బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ, కొత్తపార్టీ ఏర్పాటుకే అమరీందర్ మొగ్గు చూపారు. గతంలో అమరీందర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఈ కారణాలతోనే సీఎం పదవి నుంచి కాంగ్రెస్ అమరీందర్ సింగ్ ను తప్పించింది. కాగా కొత్త పార్టీ ఏర్పాటు అనంతరం బీజేపీతో పోత్తు ఉంటుందని భావించినప్పటికీ, కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలు, రైతుల నిరసనకు సరైన మార్గం చూపిస్తేనే పొత్తు కుదురుతుందని అమరీందర్ గతంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news