పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో ఈ రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. అమిత్ షా తో భేటీ తర్వాత ఆయన రైతులతో భేటీ కానున్నారు. వ్యవసాయ చట్టాలపై ఉన్న అనుమానాలను తొలగించడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీ వేయాలని కేంద్రం భావించగా రైతుల ప్రతినిధులు ఏకగ్రీవంగా తిరస్కరించారు.
వ్యవసాయ రంగంలో “చారిత్రాత్మక సంస్కరణలు” అని పిలిచే చట్టాలను రద్దు చేసే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ రైతులు మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. కార్పొరేటర్లకు అనుకూలంగా ఈ చట్టాలను ఆమోదించారు అని, ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేసారు.