సిద్దిపేటలో పంజాబ్ సీఎం.. కొండపోచమ్మసాగర్‌ను పరిశీలించిన భగవంత్‌సింగ్‌

-

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌ను ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. కాళేశ్వరం నుంచి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉందని, 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఇది 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని వివరించారు.

అనంతరం కొండపోచమ్మ సాగర్‌ పంప్‌ హౌస్‌ను, తొగుటలోని మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును కాసేపట్లో సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ సందర్శించనున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి తెలుసుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌తోపాటు గజ్వేల్‌ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను పరిశీలిస్తున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు. మొదట సిద్దిపేట జిల్లాలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్​కు తోడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పర్యటిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం కేవలం పంజాబ్ ముఖ్యమంత్రి మాత్రమే పర్యటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news