సామాన్యులకు షాక్‌.. మరోసారి వంటనూనె ధర పెంపు

-

మరోసారి వంటనూనె ధరలు సామాన్య ప్రజలకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.  రెండు, మూడేళ్ల క్రితం లీటరుకు రూ.80 నుంచి రూ.90 పలికిన వంట నూనె ధరలు.. ఆ తర్వాత రూ.200లకు చేరుకున్నాయి. ఏడాది నుంచి కాస్త తగ్గి ఇప్పుడు రూ.150లకు పైనే ఉన్నాయి. అయితే..మరోసారి వంటనూనె ధరలు పెరగబోతున్నాయనే సంకేతాలు ప్రజానికాన్ని కలవరపెడుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో ఇప్పటికే చుక్కలు చూస్తున్న సామాన్యులకు త్వరలోనే భారీ షాక్ తగలనుంది.

రష్యా, ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో విపరీతంగా పెరిగిన వంటనూనె ధరలు కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. హమ్మయ్య అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి సామాన్యులపై వంట నూనెల పిడుగు పడబోతోంది. మన దేశంలో అధికంగా ఉపయోగించే నూనె పామాయిల్‎ని ప్రస్తుతం ఇండోనేషియా నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. తాజాగా ఇండోనేషియా పామాయిల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇండోనేషియా నుంచి పామాయిల్ దిగుమతులు తగ్గిపోతే.. ఆ ప్రభావం వంటనూనె తీవ్రంగా ఉంటుంది. సరఫరా తగ్గితే ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇండోనేషియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన దేశంలో పామాయిల్ సహా ఇతర వంటనూనెలు 10శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. భారత్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో వంట నూనె ధరలు మరోసారి కొండెక్కితే..మరోసారి సామాన్యులకు చుక్కలు చూపుతాయి. గతేడాది కూడా ఇండోనేషియా ఇలానే ఒక్కసారిగా పామాయిల్ ఎగుమతులను నిలిపివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news