బెంగ‌ళూరుపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ ఘ‌న విజ‌యం

-

షార్జాలో గురువారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 31వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఘ‌న విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు విసిరిన 172 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పంజాబ్ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు. చివ‌రి ఓవ‌ర్‌లో కొంచెం ఇబ్బంది ప‌డ్డా ఎట్ట‌కేల‌కు పంజాబ్ జ‌ట్టు బెంగ‌ళూరుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

punjab won by 8 wickets against bangalore in ipl 2020 31st match

మ్యాచ్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ కోహ్లి, క్రిస్ మోరిస్‌లు రాణించారు. 39 బంతులు ఆడిన కోహ్లి 3 ఫోర్ల‌తో 48 ప‌రుగులు చేయ‌గా, మోరిస్ 8 బంతుల్లోనే 1 ఫోర్‌, 3 సిక్స‌ర్ల‌తో 25 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, ఎం అశ్విన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. అర్ష‌దీప్ సింగ్‌, క్రిస్ జోర్డాన్‌లు చెరొక వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 177 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ఓపెన‌ర్‌, కెప్టెన్ కేఎల్ రాహుల్‌, క్రిస్ గేల్‌లు అర్థ సెంచ‌రీల‌తో రాణించారు. 49 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స‌ర్ల‌తో రాహుల్ 61 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, గేల్ 45 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స‌ర్ల‌తో 53 పరుగులు చేశాడు. మ‌రో బ్యాట్స్‌మ‌న్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 45 ప‌రుగులు చేశాడు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో చాహ‌ల్‌కు 1 వికెట్ ద‌క్కింది. మ‌రొక వికెట్ ర‌నౌట్ రూపంలో ల‌భించింది.

Read more RELATED
Recommended to you

Latest news