బ్యాంక్ లాకర్లో డబ్బులు, ముఖ్యమైన పత్రాలు లాంటివి దాచుకుంటారు.వాటికి మనం అద్దె కూడా చెల్లిస్తుంటారు. ఇంట్లో ఉంటే సేఫ్టీ కాదు అనుకోని ఇలా దాచుకుంటారు. మరీ బ్యాంకులో ఉంటే సేఫ్టీయేనా..? బ్యాంకు లాకర్లో పెట్టిన రూ. 18 లక్షలు చెదలు తినేశాయి.. దీనిపై బ్యాంకు ఎలా స్పందించిందో తెలుసా..?
ఓ తల్లి తన కూతురి పెళ్లి కోసం బ్యాంక్ లాకర్లో దాచుకున్న రూ.18లక్షల కరెన్సీ నోట్లను చెద పురుగులు తినేశాయి. ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన డబ్బు అది. చెదపురుగులు ఎలా వచ్చాయో, ఎప్పుడు వచ్చాయో గానీ కరెన్సీ నోట్లను మొత్తం తినేశాయి. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. రిపోర్టుల ప్రకారం.. 2022 అక్టోబర్ నుంచి ఆ మనీ, బ్యాంక్ లాకర్‌లో ఉంచినట్లు తెలిసింది.
ఈమధ్య (RBI) KYC వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. అందులో భాగంగా బాధితురాలు.. బ్యాంకుకి వచ్చి లాకర్ తెరిచింది. ఆమె ట్యూషన్ చెప్పుకొని జీవిస్తుంది. ఓ చిన్న వ్యాపారం కూడా చేస్తోంది. అలా కూడబెట్టిన డబ్బును, కొన్ని నగలను లాకర్లో దాచుకుంది.రిపోర్టుల ప్రకారం.. ఆమె తన విలువైన వస్తువులను లాకర్లో సరైన పద్ధతిలో దాచుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. మహిళకు చెందిన విలువైన వస్తువులు ఎంతమేరకు దెబ్బతిన్నాయనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు
ఇలా జరిగితే పరిహారం ఇస్తారా?:
ప్రభుత్వానికి చెందిన డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (DICGC) ప్రకారం వ్యక్తిగత లాకర్ డ్యామేజ్‌లకు రూ.1 లక్ష కనీస పరిహారంగా ఇస్తారు. రిజర్వ్ బ్యాంక్ (RBI) రూల్స్ ప్రకారం లాకర్లలో ఉంచే వస్తువులకు బ్యాంకులు రక్షణ కల్పిస్తాయి. అంతవరకే వాటికి బాధ్యత ఉంటుంది. అయితే ఏం వస్తువులు పెడుతున్నారో వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. ఎవరు ఏం దాచుకున్నా, అవి పాడైతే, వాటికి పరిహారం ఇవ్వాల్సి న బాధ్యత బ్యాంకులకు ఉండదు.
ప్రకృతి విపత్తులు అంటే వరదలు, భూకంపాల వంటివి వచ్చి లాకర్లు డ్యామేజ్ అయితే, వాటికి బ్యాంకుల నుంచి పరిహారం లభించదు. లాకర్ చోరీ జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా, ఇతర డ్యామేజీ ఏదైనా జరిగితే మాత్రం బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. పోయిన వాటికి పరిహారం చెల్లిస్తాయి. ఈ కేసులో ఆ మహిళకు పూర్తి పరిహారం దక్కే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. పాపం..ఎంతో కష్టపడి అంత డబ్బు దాచుకుంది. చివరికి ఇలా అయిపోయాయి. బ్యాంకు లాకర్లు వాడేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండండి.!