సెమీస్ మ్యాచ్‌లో పీవీ సింధు ఓటమి..

-

తెలుగు తేజం బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు.. థాయిలాండ్ ఓపెన్ సెమీస్ మ్యాచ్‌లో ఓట‌మి పాలైంది. నేడు జ‌రిగిన మ్యాచ్‌లో ఒలింపిక్ విజేత చెన్ యు ఫెయి చేతిలో 17-21, 16-21 స్కోర్‌తో సింధు ప‌రాజయాన్ని చ‌విచూసింది. ఈ మ్యాచ్‌ను చెన్ కేవ‌లం 43 నిమిషాల్లో సొంతం చేసుకున్న‌ది. మూడ‌వ సీడ్‌గా చెన్ పోటీ ప‌డ‌గా.. ఆర‌వ సీడ్‌గా సింధు ఈ టోర్నీలో బరిలోకి దిగింది. తొలి గేమ్ అర్థ‌భాగం వ‌ర‌కు 7-11 స్కోర్‌తో సింధు వెన‌క‌బ‌డి ఉంది.

PV Sindhu looks to complete unfinished business in Japan | Sports News,The  Indian Express

అయితే పూర్తిగా ఆధిప‌త్య ఆట‌ను ప్ర‌ద‌ర్శించింది చెన్. ఇక రెండ‌వ గేమ్‌లో ఓ ద‌శ‌లో 6-3 స్కోర్ తేడాతో సింధు లీడింగ్‌లో ఉన్నా ఆ త‌ర్వాత చైనీస్ ప్లేయ‌ర్ గేర్ మార్చి ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఏడాది ఇప్ప‌టికే స‌య్య‌ద్ మోదీ ఇంట‌ర్నేష‌న‌ల్‌, స్విస్ ఓపెన్ టోర్నీల్లో సింధు విజేత‌గా నిలిచింది. ఇక జూన్ 7వ తేదీ నుంచి జ‌రిగే ఇండోనేషియా మాస్ట‌ర్స్ సూప‌ర్ 500 టోర్నీలోనూ సింధు పాల్గొన‌నున్న‌ది.

Read more RELATED
Recommended to you

Latest news