విధి రాసిన రెండు హృదయాల కథ ‘రాధకు నీవేరా ప్రాణం’.. ఏప్రిల్ 24న ప్రారంభం.. మీ జీ తెలుగులో!

-

హైదరాబాద్, 18 ఏప్రిల్: తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడంలో తిరుగులేని ఛానల్ జీ తెలుగు. వినోదంతోపాటు ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్తో ఆకట్టుకుంటున్న జీ తెలుగు మరో సరికొత్త సీరియల్తో మీ ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని అందించడంలో ముందుండే జీ తెలుగు సరికొత్త కథనాలు, ఆలోచింపజేసే ఇతివృత్తాలతో ఆసక్తికర మలుపులతో సాగే సీరియల్స్ని అందిస్తూ అలరిస్తోంది. ఈ వినోదాన్ని రెట్టింపు చేసేందుకు మరో కథతో మీ ముందుకు రానుంది. రెండు విభిన్న హృదయాల మధ్య సాగే సరికొత్త ప్రేమకథాంశంతో రూపొందుతున్న ‘రాధకు నీవేరా ప్రాణం’ సీరియల్ ఈ నెల 24 న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు.. మీ జీ తెలుగులో.

జీ తెలుగులో ప్రారంభం కానున్న ‘రాధకు నీవేరా ప్రాణం’ తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచబోతోంది. ఓ చిత్రకారిణి, ఓ పోలీసు అధికారి మధ్య సాగే ప్రణయగాథనే ఈ సీరియల్. ఇద్దరి జీవితాల్లో ప్రమాదం రూపంలో విధి నడిపించే కథతో సాగే ఈ సీరియల్ జీ తెలుగు ప్రేక్షకులకు దెగ్గరవ్వబోతుంది.. తన అభిరుచిని సానబెడుతూ మంచి కళాకారిణిగా రాణిస్తూ కుటుంబ బాధ్యతలతో సాగిపోతున్న రాధిక జీవితం ప్రమాదం బారినపడి ఏమైపోయింది?

హాయిగా సాగిపోతున్న ఓ పోలీసు అధికారి జీవితంలో సంభవించిన పెనుప్రమాదం అతనిని ఎలా మార్చింది? మోడువారిని అతని మనసుని ప్రేమ ఎలా కరిగించింది? ఈ భిన్న ధ్రువాల మధ్య ప్రేమ ఎలా వికసిస్తుంది?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘రాధకు నీవేరా ప్రాణం’ తప్పక చూడాల్సిందే. ఈ సీరియల్లో నిరుపమ్ పరిటాల, గోమతి ప్రియ జంటగా నటిస్తుండగా, చైత్రా రాయ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సీరియల్లో పోలీసు అధికారి పాత్రలో టెలివిజన్ సూపర్స్టార్ నిరుపమ్ పరిటాల మరోసారి జీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. రాధికగా గోమతి ప్రియ నటిస్తుండగా, కార్తిక్ కృష్ణ(KK)గా మీ ముందుకు రానున్నారు నిరుపమ్. ‘‘రాధకు నీవేరా ప్రాణం’ సీరియల్లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. కథ, కథనం, ఎమోషన్స్, వినోదం.. ఇలా అన్ని అంశాలను కలబోసిన కథ ఇది. ఈ సీరియల్లో ప్రేక్షకులకు కావలసిన అన్నిరకాల అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.

కార్తిక్ కృష్ణ పాత్ర చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చాలా కుతూహలంగా ఉన్నాను. ప్రతి పాత్రలోనూ నన్ను ఆదరించే నా అభిమాన ప్రేక్షకులు కార్తిక్ కృష్ణగానూ తప్పక ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నిరుపమ్. మరి ఈ సరికొత్త ప్రేమ కథను చూసేందుకు మీరూ సిద్ధం కండి. రాధకు నీవేరా ప్రాణం ప్రారంభంతో మిగతా సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. వైదేహి పరిణయం మధ్యాహ్నం 12 గంటలకు, దేవతలారా దీవించండి మధ్యాహ్నం 3:30 గంటలకు, కల్యాణం కమనీయం సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతాయి. జీ తెలుగు ప్రేక్షకులు దయచేసి గమనించగలరు.

ప్రేమ, విధి మధ్య సాగే సరికొత్త సంగ్రామం ‘రాధకు నీవేరా ప్రాణం’, ఈ నెల 24న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు, మీ జీ తెలుగులో!

Read more RELATED
Recommended to you

Latest news