టాయిలెట్‌ సీట్‌పైన కంటే ఎక్కువ బాక్టీరియా మేకప్‌ బ్రష్‌పై ఉంటుంది తెలుసా..?

-

చాలామంది… బాత్రూమ్‌లోకి కూడా ఫోన్లు తీసుకెళ్తారు.. దాని వల్ల కంటికి కనపడని బాక్టీరియా ఫోన్‌కు ఫోన్‌ ద్వారా మీకు అంటుకుంటుంది.. కానీ మీకు తెలుసా.. బాత్రూమ్‌లో టాయిలెట్‌ సీటు మీద ఉండే బాక్టీరియా కంటే.. మేకప్‌ బ్రష్‌ మీద ఎక్కువ బాక్టీరియా ఉంటుందట.. ఇమాజిన్‌.. అంత బాక్టీరియాను అమ్మాయిలు.. ముఖానికి రాసుకుంటున్నారా..? కాస్మోటిక్ టూల్ బ్రాండ్ స్పెక్ట్రమ్ కలెక్షన్స్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం శుభ్రం చేయని మేకప్ బ్రష్‌లో భయంకరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని తేలింది.

 

 

రెండు వారాల పాటు సాగిన ఈ పరిశోధనాలతో శుభ్రమైన, శుభ్రపరచని మేకప్ బ్రష్‌లను పరిశీలించారు. ఈ బ్రష్‌లను బెడ్ రూమ్ వానిటీ, మేకప్ బ్యాగ్, డ్రాయర్, బ్రష్ నిర్దిష్ట బ్యాగ్, బాత్రూమ్ హోల్డర్ వంటి అనేక ప్రాంతాల్లో నిల్వ చేశారు. వాటిని పరిశీలించగా టాయిలెట్ సీట్‌తో పోలిస్తే బ్యాక్టీరియా మేకప్‌ బ్రష్ మీద ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

ఇది ఎలా ప్రభావితం చేస్తుంది?

మేకప్ బ్రష్ బ్యాక్టీరియా డెడ్ స్కిన్ సెల్స్, మొహం నుంచి ఆయిల్‌ని తెప్పిస్తాయి. అయితే అన్నీ రకాల బ్యాక్టీరియాయ హానికరం కాదు. డర్టీ బ్రష్‌లు ఉపయోగించడం వల్ల మొటిమలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల సంఖ్యలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. వ్యాధికారక సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల బ్రేక్ అవుట్, ఇంపెటిగో ఇన్ఫెక్షన్స్ వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. బ్యాక్టీరియాని తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా మేకప్ బ్రష్ క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

ఎలా చేయాలి?

మేకప్ బ్రష్‌లను కనీసం వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి.
సున్నితమైన గుణాలు కలిగిన లిక్విడ్‌ని తీసుకోవాలి.
ఒక కప్పు నీటిలో 2-3 చుక్కల లిక్విడ్ వేసి వాటిలో బ్రష్ లన్నింటినీ అందులో ఉంచాలి.
ఆ తర్వాత ఒక్కొక్కటిగా వాటిని కడగాలి. బ్రష్ పై మేకప్ ఉత్పత్తి ఏది మిగిలిపోకుండా చూసుకోవాలి.
శుభ్రమైన టవల్ తీసుకుని వాటిని ఆరబెట్టుకోవాలి.
ఇక ఐలైనర్, పౌండేషన్ బ్రష్‌లు (క్రీమ్ ఆధారిత ఉత్పత్తుల కోసం ఉపయోగించేవి) వాడిని ప్రతిసారీ శుభ్రం చేయాలని నిపుణులు అంటున్నారు.

పౌడర్ ఆధారిత ఉత్పత్తులకు ఉపయోగించే బ్రష్‌లు కూడా త్వరగా క్లీన్ చేసుకోవాలి. బ్రష్ ముళ్ళపై స్ప్రే చేసి ఆపై టిష్యూతో శుభ్రం చేసుకోవచ్చు. ఇక వాటిని సరైన పద్ధతిలో స్టోర్ చేసుకోవాలి. దుమ్ము, ధూళి పడకుండా మూసి ఉన్న కంటైనర్లో వాటిని నిల్వ చేసుకోవాలని సూచిస్తున్నారు. మేకప్ బ్రష్‌ను శుభ్రమైన జిప్పర్ బ్యాగ్‌లో భద్రపరుచుకోవడం ఉత్తమం. ఈ బ్రష్‌లను గాలి తగిలే విధంగా బయట వదిలేయడం, డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో పెట్టడం వంటివి చేస్తే బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. అందుకే మేకప్ బ్రష్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news