క్షమాపణ చెప్పిన రాఘవ లారెన్స్

-

చంద్రముఖి-2 ఆడియో రిలీజ్ వేడుకలో ఓ విద్యార్థిపై బౌన్సర్ దాడి చేయడంపై హీరో రాఘవ లారెన్స్ స్పందించారు. ‘ఇలాంటి గొడవలకు నేను వ్యతిరేకిని. మనం వెళ్లే చోటు సంతోషంగా, శాంతితో ఉండాలని కోరుకుంటాను. కారణమేదైనా ఓ వ్యక్తి మరో వ్యక్తిని కొట్టడం తప్పు. ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. అందుకు నేను క్షమాపణ చెబుతున్నా. ఇకపై ఇలాంటి దాడులకు పాల్పడవద్దని బౌన్సర్లకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని లారెన్స్ సూచించారు. ‘చంద్రముఖి2’ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో బౌన్సర్‌లలో ఒకరు కాలేజీ స్టూడెంట్‌తో గొడవకు దిగిన సంఘటన గురించి నాకు ఇప్పుడే తెలిసింది.

I Will Distribute Food To The Hungry Whenever I Can, Says Raghava Lawrence

విద్యార్థులను నేను ఎంతగా ప్రేమిస్తానో.. వారు ఎదగాలని ఎంత కోరుకుంటానో అందరికీ తెలుసు. మనం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్లిన ఆనందం, శాంతి ఉండాలని కోరుకుంటాను. ఇక కారణం ఏదైనప్పటికీ, ఎవరినైనా కొట్టడం కచ్చితంగా తప్పు. ముఖ్యంగా స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఇది జరగకూడదు. కానీ ఆడియో లాంచ్‌లో ఇలా జరగడంపై నేను వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నాను. ఇక నుంచైనా బౌన్సర్‌లు ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొనవద్దని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు’ అంటూ లారెన్స్ రాసుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news