సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా లారెన్స్‌ ‘రుద్రుడు’.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌..

ఇటు కొరియోగ్రాఫర్‌గానే కాకుండా అటు నటుడిగా కూడా రాఘవ లారెన్స్ ప్రేక్షకులను మెప్పించారు. ముని సినిమాతో తనలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని కూడా తీయగల నైపుణ్యం కూడా ఉందని చూపించిన లారెన్స్.. వరుసగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు లారెన్స్‌.. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రమైన ‘రుద్రుడు’ నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ‘దెయ్యాలు పుట్టవు .. సృష్టించబడతాయి’ అనే బేస్ లైన్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది.

Raghava Lawrence Coming Out of his Zone will it work

జాతరలో విలన్ గ్యాంగ్ భరతం పడుతున్న లారెన్స్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. గతంలో కూడా కాంచన సినిమాలో శరత్‌ కుమార్‌ నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మరికొన్ని రోజుల్లో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది.