Breaking : ఏపీకి మరో నాలుగు భారీ పరిశ్రమలు..

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం తిరుప‌తి జిల్లా పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఐదు ప‌రిశ్ర‌మ‌ల‌కు సీఎం జగన్‌ భూమి పూజ చేశారు. అంతేకాకుండా మ‌రో నాలుగు కంపెనీల‌తో కొత్త‌గా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేర‌కు గురువారం తిరుప‌తి వెళ్లిన జ‌గ‌న్‌… అపాచీతో పాటు ప్యానెల్ ఆప్టో డిస్‌ప్లే టెక్నాల‌జీస్ లిమిటెడ్‌, డిక్సాన్ టెక్నాల‌జీస్‌, ఫాక్స్ లింక్, స‌న్నీ ఆప్టో టెక్ భూమి పూజ చేశారు.

Image

అనంత‌రం అక్క‌డే పీఓటీపీఎల్‌ ఎలక్ట్రానిక్స్‌, టెక్ బుల్స్, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్, జెట్ వర్క్ టెక్నాలజీస్ సంస్థలతో కీల‌క ఒప్పందాలు చేసుకున్నారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ) అధికారులు ఆయా కంపెనీల‌తో ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా ఏపీకి ఏ మేర పెట్టుబ‌డులు రానున్నాయ‌న్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.