ఎక్కడైనా అధికార పార్టీలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్. అవి సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎవరికి వారు రాజకీయం కోసం అలా విమర్శలు చేయడం, ప్రతి విమర్శలు చేయడం జరుగుతుంది. సరే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే..అవి రాజకీయం కోసం చేస్తున్నాయని కొట్టి పారేయొచ్చు. కానీ అధికార పార్టీలో ఉన్నవారే..సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తే..అప్పుడు పరిస్తితి ఏంటి అనేది ఊహించని విధంగా ఉంటుంది. పోనీ ఎవరైనా ఒకరు మాట్లాడితే..వారు ప్రతిపక్షాల స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారని అనుకోవచ్చు..కానీ నలుగురైదుగురు మాట్లాడితే..ప్ర్రభుత్వంలో ఏదో తప్పు జరుగుతుంది..దాన్ని సరి చేసుకోవాలనే కాన్సెప్ట్ అయి ఉండవచ్చు.
అయితే ఏపీలో అధికార వైసీపీపై మొదట తిరుగుబాటు జెండా ఎగరవేసింది. ఎంపీ రఘురామకృష్ణం రాజు. సొంత పార్టీ ఎంపీ అయి ఉండి కూడా ఈయన..తమ ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు ఇసుకలో, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు చేస్తున్నారని రఘురామ మొదట గళం విప్పారు. ఈ విషయంలో జగన్‌తో మాట్లాడేందుకు రఘురామ చూశారు గాని..కొందరు వైసీపీ నాయకులు రఘురామకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు..పైగా ఆయనపై తిరిగి కౌంటర్లు వేశారు. అప్పటినుంచి రఘురామ వర్సెస్ వైసీపీ అన్నట్లు వార్ నడుస్తోంది. ప్రతిరోజూ రఘురామ ప్రెస్ మీట్ పెట్టడం వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో రఘురామ బాటలోనే మరికొందరు నడుస్తున్నారు. ముందు నుంచి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తమ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పి వాటిని ఎత్తిచూపిస్తున్నారు.
తాజాగా కూడా ఏం చేశామని ఓట్లు అడగాలని, పెన్షన్లు ఇస్తే ఓట్లు వేయరని అన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చలేదు..కొత్త ప్రాజెక్టులు కట్టలేదు..ఇళ్ళు కట్టించి ఇవ్వలేదు..ఇంకా ఓట్లు ఎలా అడగాలని అంటున్నారు. అటు మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం పెన్షన్ల కోతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్లు కొత్త కొస్తే గడపగడపకు ఎలా వెళ్తామని నిలదీశారు. ఆ మధ్య ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్..జగన్ బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నారు..వాలంటీర్లు అన్నీ చూసుకుంటున్నారు..ఇంకా తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని అడిగారు.
ఇటు సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు ఎగరవేస్తున్న నేపథ్యంలో..వారిపై కూడా వేటు వేయగలరా? అని రఘురామ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెబితే తప్పు ఏముందని అంటున్నారు. మొత్తానికి రఘురామకు ఒక ఆయుధం దొరికినట్లు అయింది.