నేను అరెస్ట్ అయ్యేదాకా భోజనం చేయనని జగన్ శపధం పట్టారట !

-

ఏపీ సీఎం జగన్ మీద నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంలో సీఎం జగన్, ప్రవీణ్ ప్రకాష్ లు సక్సెస్ అయ్యారని ఆయన అన్నారు. నన్ను అరెస్ట్ చేయించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారన్న ఆయన నన్ను అరెస్టు చేసేంతవరకు భోజనం చేయనని జగన్ శపధం పట్టారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయని అన్నారు.

ఉన్మాదులైన నాయకుల నుండి ప్రజలను రక్షించే వ్యవస్థ మీద దాడికి దిగడం అశుభపరిణామమని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ ఆర్టికల్ 356 అమలు దిశగా సాగుతున్నాయని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. చెడుపై మంచి తప్పక విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఇక ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సంబందించిన కంపెనీల మీద సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మొన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news