పిల్లలు రోజుకి ఒక మామిడి పండు తింటే ఎన్ని లాభాలంటే…?

-

మామిడి పండ్లు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. వేసవిలో మాత్రమే మనకి మామిడి పండ్లు దొరుకుతాయి. మామిడి పండ్లు పిల్లలు తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు. మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలు మామిడి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఎనిమిది నెలలు కంటే పెద్ద అయిన వాళ్ళకి మామిడిపండ్లు పెట్టొచ్చు. దీనిలో మంచి పోషక పదార్థాలు ఉంటాయి. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

అదే విధంగా జీర్ణ సమస్యలు ఉండవు. బ్రెయిన్ డెవలప్ అవడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటితో ఇది పోరాడుతుందని నిపుణులు చెప్పారు.

ఎందుకు పిల్లలకి ఇది చాలా ముఖ్యం..?

పండిన మామిడి పండులో విటమిన్ ఏ ఉంటుంది. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది అని వైద్యులు అంటున్నారు. అదే విధంగా దీనిలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి.

ఎనిమిది నుండి పది నెలలు దాటిన పిల్లలకి మామిడి పండ్లు పెట్టచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయేరియా వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఫిజికల్లీ వీక్ గా ఉండే వాళ్ళకి మ్యాంగో షేక్ చేసి ఇస్తే మంచిది.

తక్షణ శక్తిని కూడా మామిడి ఇస్తుంది. దీనిలో విటమిన్ బి6, బీ2 కూడా ఉన్నాయి. సాయంత్రం పూట పిల్లలకి మామిడి పండ్లు పెట్టొచ్చు.

రోగ నిరోధక శక్తి పెంచుతుంది:

పిల్లలకి మామిడి పండ్లు పెట్టడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా తక్షణ శక్తిని ఇచ్చి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా సహాయం చేస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news