మోదీ అభివృద్ధి బండి రివర్స్ గేర్ లో ఉంది.- రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోమారు కేంద్రం తీరుపై ఫైర్ అయ్యారు. ’మోదీజీ అభివృద్ధి బండి రివర్స్ గేర్ లో ఉంది. దానికి కనీసం బ్రేకులు కూడా లేవు‘ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. పెరిగిన ఎల్పీజీ రేట్లపై ఎన్డీయే సర్కారుపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి మాటలు చేతలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్ల లక్షలాది కుటుంబాలు చెక్కపొయ్యిలు వెలిగించాల్సి వచ్చిందని అన్నారు. rahul gandhi

ఎల్పీజీపై ధరల పెరుగుదల కారణంగా సుమారు 42 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ వాడటాన్ని మానేశారన్న ఓ సర్వే వివరాలను గుర్తు చేశారు. దీంతో ప్రజలు గ్యాస్ సిలిండర్లు వాడలేక కట్టెల పొయ్యిలను వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దేశీయంగా ఎల్పీజీ సిలండర్ల రేట్లు పెరగడంతో రాహుల్ గాంధీ కేంద్రాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శించారు.