ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే నేడు మూడో రోజు యాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ యాత్ర ముగిసింది. అనంతరం శుక్రవారం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. బీజేపీకి, టీఆర్ఎస్ మద్ధతు పలుకుతోందన్నారు. ఉభయ సభల్లో బీజేపీకి, టీఆర్ఎస్ మద్ధతుగా వుందని.. తెలంగాణలో రాజు పాలన వుందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ప్రతి సాయంత్రం సీఎం ధరణి పోర్టల్ చూస్తారని .. ఎవరు ఎక్కడ.. ఏం కొన్నారు, అని చూస్తారని ఆయన ఆరోపించారు.
ఎక్కడెక్కడ భూములు వున్నాయి.. ఎవరి భూములు లాక్కోవాలని చూస్తారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అటవీ హక్కుల చట్టంతో గిరిజనులకు తాము భూములు ఇచ్చామని.. తెలంగాణ ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటోందని ఆయన ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విధ్వంసం సృష్టిస్తోందని.. జీఎస్టీతో నష్టపోతున్నామని చేనేత కార్మికులు చెప్పారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీలో మార్పులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ మళ్లీ చేస్తామని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.