రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో అద్భుతంగా కొనసాగిన రాహుల్ యాత్ర..ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతుంది. తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి రాహుల్ యాత్రకు అపూర్వ స్పందన వస్తుంది. వాస్తవానికి జనంలో ఎక్కువ కనిపించని రాహుల్.. జోడో యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని అందరూ అనుమానించారు. కానీ ఊహించని విధంగా రాహుల్ యాత్రకు స్పందన వస్తుంది. పూర్తిగా జనంతో మమేకం అవుతున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో రాహుల్‌కు ప్రజలు పెద్ద ఎత్తున మద్ధతు ఇస్తున్నారు. ఎలాంటి కల్మషం లేని నాయకుడుగా ఉన్న రాహుల్‌ని ప్రజలు ఆదరిస్తున్నారు. అసలు తన కోసం ప్రజలతో హక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఊహించని పరిణామాలతో రాహుల్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఎవరిని కలిస్తే.. వారికి తగ్గట్టుగా నడుస్తున్నారు. డప్పుల బృందం కలిస్తే..డప్పు కొట్టి ఆకట్టుకున్నారు. పిల్లలతో ఆడుకుంటున్నారు. రన్నింగ్ రేసు చేస్తున్నారు. ప్రజల మనిషిగా ముందుకు కొనసాగుతున్నారు.
ఇక మొన్నటివరకు హైదరాబాద్ పరిధిలో కొనసాగిన రాహుల యాత్రకు ఊహించని స్పందన వచ్చింది.. అలాగే ఆయన టీఆర్ఎస్-బీజేపీలపై గట్టిగానే సెటైర్లు వేశారు. వ్యక్తిగత విమర్శలు చేయకుండా.. సున్నితంగా విమర్శించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తన యాత్రతో అన్నీ వర్గాల ప్రజలకు దగ్గరవుతున్నారు. ప్రజలు సైతం రాహుల్‌ని తమవాడిగా భావిస్తున్నారు. తాజాగా రాహుల్ యాత్ర సంగారెడ్డిలో కొనసాగుతుంది.
రాహుల్ యాత్రలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంచి జోష్‌గా పాల్గొన్నారు. అలాగే పోతురాజులు కొరడాలతో కొట్టుకుంటుంటే.. రాహుల్ సైతం కొరడా తీసుకుని కొట్టుకుని అందరికి షాక్ ఇచ్చారు. అయితే రాహుల్ యాత్రపై అనేక సెటైర్లు వేస్తున్నాయి. రాహుల్ యాత్ర చేయట్లేదు.. ఎక్సర్‌సైజ్ చేస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. రాహుల్ కూడా దానికి తగ్గట్టుగా కౌంటర్లు ఇస్తున్నారు. ఎక్సర్‌సైజ్ చేయాలంటే జిమ్‌లోనే చేస్తా కదా అని అంటున్నారు. రాహుల్ యాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వస్తుందని చెప్పొచ్చు. దాన్ని కాంగ్రెస్ నేతలు ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి.