త్వరలో రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ” భారత్ జోడో” పాదయాత్ర 12 రోజులపాటు తెలంగాణలో కొనసాగుతుందని తెలిపారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. మక్తల్ నుండి జుక్కల్.. నాందేడ్ లోకి వెళుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు మహేశ్వర్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా సిబిఐ విచారణలో బయటపడుతుందన్నారు. కాంగ్రెస్ నేతలకు సంబంధం ఉంటే చూస్తూ ఊరుకోదని.. కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎంకరేజ్ చేయదన్నారు.
లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై సిబిఐ విచారణ చేస్తుందని.. వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. ఒబెరాయ్ హోటల్ లో చర్చలు వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. ఒకవేళ వాస్తవం కాకుంటే నిరూపించుకోవాలన్నారు. మొన్నటివరకు టిఆర్ఎస్, బిజెపి లు మిత్రులుగా ఉన్నారని.. ఇప్పుడు అధికార దాహంతో ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. కవిత తప్పు చేయకపోతే రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవచ్చు అని? అన్నారు.