బిజెపి ఉచితాలు రద్దు చేయమంటుందని.. ఉచితాలు రద్దు చేయమన్న బిజెపిని మనం రద్దు చేయాలని అన్నారు మంత్రి హరీష్ రావు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచి మీకు బ్యాంకులో డబ్బులు వేస్తాం అన్నారని.. ఇప్పుడు సబ్సిడీని ఎత్తివేసారని మండిపడ్డారు. సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు కానీ.. పది లక్షల కోట్లు కంపెనీకి మాఫీ చేశారని అన్నారు హరీష్ రావు.
దేశంలో ఎవరు కూడా పేదలకు ఇల్లు కట్టివ్వలేదని, పేదలకు ఇల్లు కట్టి ఇచ్చింది ఒక్క కేసిఆర్ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు మస్తు మాట్లాడతారు.. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు దోచుకున్నది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. పేదోళ్లకు ఇల్లు రాలే కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం పెద్దపెద్ద ఇల్లుు కట్టుకున్నారని అన్నారు. ఒకడు హిందూ, ముస్లిం కొట్లాట పెట్టి ఓట్లు కొట్టుకోవాలని చూస్తున్నాడని అన్నారు. వాళ్లను కోసినా రక్తం వస్తుంది.. మనకు కోసినా రక్తమే వస్తుంది కదా అని అన్నారు.