చిత్ర పరిశ్రమలో మరో విషాదం..బాల నటుడు మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

ఈ ఏడాది ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేట్ అయినా ” ఛెల్లో షో ” సినిమా నటుడు రాహుల్ కోలీ మరణం చెందాడు. క్యాన్సర్ తో బాధపడుతూ మంగళవారం రాహుల్ కోలీ తుది శ్వాస విడిచాడు. ” ఛెల్లో షో ” సినిమాలో భవిన్ రభారీ ప్రధాన పాత్ర పోషించగా, రాహుల్ కోలీ అతని స్నేహితుడి పాత్రలో కనిపించారు. కొన్ని రోజులుగా రాహుల్ కోలికి రక్తపు వాంతులు అవుతున్నాయని, క్యాన్సర్ వల్ల చనిపోయాడని అతని తండ్రి తాజాగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news