కోస్తా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న కూడా కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసినట్టు సమాచారం. బంగాళాఖాతం నుండి కోస్తాంధ్ర పైకి తేమతోకూడిన తూర్పు గాలులు వీస్తున్నాయని వాటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అదేవిధంగా ఉత్తరాది మీదుగా పశ్చిమ గాలులు వీస్తుండటంతో రేపటి నుండి కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో నిన్న వర్షాలు కురిసాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. దాంతో ప్రజలంతా అవాక్కయ్యారు. వర్ష ప్రభావంతో జిల్లాలో ఈదురు గాలులు వీస్తున్నాయి.