ఇండియాలో ఓమిక్రాన్ తీవ్రత క్రమంగా ఎక్కువ అవుతోంది. ఇప్పటికే రోజూ వారీ కేసుల సంఖ్య పెరిగింది. క్రమంగా అన్ని రాష్ట్రాలకు ఓమిక్రాన్ కేసులు విస్తరిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 22 రాష్ట్రాలకు ఓమిక్రాన్ వైరస్ విస్తరించింది. ప్రస్తుతం ఇండియాలో ఓమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 961కి చేరింది. ఇప్పటి వరకు ఓమిక్రాన్ బారి నుంచి 320 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 641 గా ఉంది. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలను విధించడంతో పాటు.. న్యూ ఇయర్ వేడుకలను నిషేధిస్తున్నాయి.
ఇండియాలో రాష్ట్రాల వారీగా కేసులను పరిశీలిస్తే ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లోనే 50 శాతం కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రం 62 కేసులతో ఆరో స్థానంలో ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 10 మంది ఓమిక్రాన్ నుంచి కోలుకున్నారు.
ఇండియాలో రాష్ట్రాల వారీగా ఓమిక్రాన్ కేసులను పరిశీలిస్తే… ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, గుజరాత్ 97, రాజస్థాన్ 69, కేరళలో 65, తెలంగాణలో 62, తమిళనాడులో 45, కర్ణాటకలోె 34, ఆంద్ర ప్రదేశ్ 16, హర్యానా 12, పశ్చిమ బెంగాల్ లో 11, మధ్య ప్రదేశ్ లో 9, ఒడిశా లో 9, , ఉత్తరాఖండ్ 4 కేసులు, చండీగఢ్ 3, జమ్మూ కాశ్మీర్ లో 3, ఉత్తర్ ప్రదేశ్ లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, లడఖ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.