గడిచిన 24 గంటల్లో ఆంధ్రలో ఉత్తర కోస్తా ఆంధ్రలో శ్రీకాకుళం,విజయనగరం ,విశాఖ ,తూర్పు గోదావరి జిల్లాలో వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. అత్యధికంగా విశాఖ జిల్లాలోని శృంగవరపు కోటలో ఐదు శాతం వర్షపాతం నమోదైంది… దక్షిణ కోస్తా ఆంధ్రలో, రాయలసీమలో పొడి వాతావరణం ఉంది. ఇక ఉష్ణోగ్రతలు విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో తిరుపతిలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది..
ఇక ఇవాళ రేపు ఉత్తర కోస్తా ఆంధ్ర లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఆంధ్రాలో పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఇవాళ రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో నెల్లూరు, రాయలసీమ, చిత్తూరు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటుంది అని వాతావరణ నిపుణులు అంటున్నారు.