తెలంగాణ వాసులకు అలర్ట్‌.. మరో మూడు రోజులు వర్షాలు

-

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణలో ఈవారం తెలంగాణలో వర్షాలు భారీ కురిసిన విషయం తెలిసిందే. అయితే.. నిన్నటి నుంచి కాస్తా వర్షాలకు ఉపశమనం కలిగిందో లేదో.. ఇప్పుడు మళ్లీ వర్షాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడ‌క్కడ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ మేర‌కు మంగ‌ళ‌, బుధ‌వారాల్లో వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఆవ‌ర్త‌నం ఇవాళ ద‌క్షిణ ఒడిశా ప‌రిస‌రాల్లో స‌గ‌టు స‌ముద్ర‌మ‌ట్టం నుంచి 3.1 కి.మీ. ఎత్తులో కొన‌సాగుతోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. 24వ తేదీన ఒక అల్ప‌పీడ‌నం ద‌క్షిణ ఒడిశా – ఉత్త‌ర ఆంధ్రా ద‌గ్గ‌ర‌లోని వాయవ్య బంగాళాఖాతం ప‌రిస‌రాల్లో ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ మేర‌కు గంట‌కు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలశయాలు జలకళతో కళకళలాడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version