ఇది ఎండాకాలమో.. వానాకాలమో అర్థం కావడం లేదు. అదే పనిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల మరోసారి భారీ వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్, పీర్జాదిగూడ, వనస్థలిపురం, కాప్రా, దమ్మాయిగూడ, నాగోల్, ఓయూ, రామంతాపూర్, అంబర్‌పేట్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. వర్షానికి పలుచోట్ల చెట్లు నెలకొరిగాయి.
కొన్నిచోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ఆ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వర్షంతో ఉపశమనం లభించినట్లయింది. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. ఘట్‌కేసర్‌లో వర్షం ధాటికి రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నీటిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది.