ALERT: మరికాసేపట్లో హైదరాబాద్ లో భారీ వర్షం

-

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి, ఘట్కేసర్ ప్రాంతాల్లో వర్షం పడింది. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి భారీ వర్షాలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని కాప్రా నుంచి బోడుప్పల్ ప్రాంతాల మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే నాలుగు రోజులు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, నారాయణ పేట, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. మేడ్చల్‌ మల్కాజిగిరి, వరంగల్‌, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version