రెండు రోజుల విరామం తర్వాత…పెట్రోల్‌, డీజిల్‌‌ ధరలు పెంపు…!

-

దేశీ ఇంధన ధరలు ఈరోజు మరోసారి పైకి కదిలాయి. రెండు రోజుల నుండి స్థిరంగా ఉంటున్న వీటి ధరలు మరో సరి పెరిగాయి. ఇక వీటికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 36 పైసలు చొప్పున పెరగడం జరిగింది.

దీంతో హైదరాబాద్‌ లో సోమవారం పెట్రోల్ ధర రూ.95.13కు, డీజిల్ ధర రూ.89.47కు చేరాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 1.25 శాతం పెరుగుదలతో 69.07 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.11 శాతం పెరుగుదలతో 65.62 డాలర్లకు ఎగసింది.

ఇది ఇలా ఉండగా అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇదే లెక్క లో వుంది. పెట్రోల్‌ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.97.56కు చేరింది. డీజిల్‌ ధర 34 పైసలు పెరుగుదలతో రూ.91.35కు చేరింది. అలానే విజయవాడలో అయితే పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.97.82కు చేరింది. డీజిల్ ధర 34 పైసలు పెరుగుదలతో రూ.91.61కు చేరింది.

ముంబయిలో అయితే పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.97.86కు చేరింది. డీజిల్ ధర 35 పైసలు పెరుగుదలతో రూ.89.17కు ఎగసింది. ఇక ఢిల్లీ లో రేట్లు ఎలా వున్నాయి అంటే… పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదల తో రూ.91.53కు చేరింది.

డీజిల్ ధర 33 పైసలు పెరుగుదల తో రూ.82.06కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుండడం తో పెరగొచ్చు తగ్గచ్చు లేదా అలానే ఉండచ్చు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news