తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా టికెట్ల ధరల పై నిన్న కీలక తీసుకున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై.. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.Folded handsFolded hands సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది.” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మధ్య టికెట్ల ధరలపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021