మహేశ్ ను ఎలా చూపించాలో రాజమౌళికి ఐడియా ఉంది..!!

-

తెలుగు పరిశ్రమ దర్శక దిగ్గజం భారతీయ ప్రేక్షకుల కోసం ఆర్ ఆర్ ఆర్  సినిమా తీస్తే అది నెట్ ఫ్లిక్స్ ద్వారా మొత్తం ప్రపంచాన్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వరస బెట్టి ఘనతలు సాధిస్తోంది.  రీసెంట్ గా ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్డ్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను సన్ సెట్ సర్కిల్ అవార్డు దక్కింది.అలాగే  ఈ సంత్సరమంతా ప్రపంచ స్తాయిలో విడుదల అయిన సినిమాలలో ఐ ఎం డి బి వారు ప్రజల్ని ఆకట్టుకున్న మొదటి  50 సినిమాలలో  ఆర్ఆర్ఆర్ కూడా ఎంపిక అయ్యింది.

ఇక రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ వారిచే ఉత్తమ దర్శకుడి గా ఎంపిక అయ్యారు. ఈ అవార్డ్ వచ్చిన వారు ఆస్కార్ అవార్డు కు దగ్గరగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక రాజమౌళి ప్రతి సినిమాకు అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తూ ఉంటారు. కథ మొత్తం తయారు అయిన తరువాత మళ్లీ ఇద్దరూ కలసి కూర్చొని తుది మెరుగులు దిద్దు కుంటారు.

ప్రస్తుతం మహేశ్ బాబు కథ మీద విజయేంద్ర ప్రసాద్ ఫుల్ బిజీ గా ఉన్నారు. తాజాగా ఆయన ఈ సినిమా పై ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మహేశ్ బాబు చాలా సూపర్ యాక్టర్.తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలు చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఇలాంటి వారికి ఎలాంటి పాత్ర అయినా చేసే గట్స్ ఉంటాయి. ఇక రాజమౌళి కూడా వచ్చే సినిమా వరల్డ్ సూపర్ హీరో, అడ్వెంచర్ హీరో సినిమా తీయాలని చూస్తున్నాడు. తనకి మహేశ్ ను ఎలా చూపించాలని అనుకుంటున్నది నాకు ఔట్ లైన్ చెప్పాడు. దాన్ని బట్టి నాకు స్క్రిప్ట్ వర్క్ ఇంకా ఈజీ అయ్యింది అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news