పూర్ణతో ఎఫైర్ నిజమే.. ఓపెన్ అయిన రవి బాబు

-

ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబుకు హీరోయిన్ పూర్ణతో రిలేషన్ ఉందని వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూ వస్తున్నాయి. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందని కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదని రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన రవి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.

నటుడుగా మంచి పేరు సంపాదించుకున్న రవిబాబు దర్శకుడిగా పలు సినిమాలు తెరకెక్కించారు. అయితే ఈయన తెరకెక్కించిన చాలా సినిమాల్లో పూర్ణ హీరోయిన్గా నటించారు. రవిబాబు, పూర్ణ కాంబినేషన్‌లో `అవును` `లడ్డూబాబు“అవును2“అదిగో“అసలు` చిత్రాలు వచ్చాయి. ఇందులో `అవును` మాత్రమే హిట్‌ అయ్యింది. `అసలు` రిజల్ట్ తేలాల్సి ఉంది. కాగా అప్పట్లో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచిందని వార్తలు గట్టిగా వినిపించాయి తాజాగా పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన అసలు సినిమాని రవి బాబు రూపొందించగా ఈ సినిమా త్వరలోనే ఓటిటి వేదికగా విడుదలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి బాబుకు పూర్ణత ఎఫైర్ పై ప్రశ్నించగా నిజమేనంటూ షాక్ ఇచ్చారు.

ఈ విషయంపై మాట్లాడిన రవిబాబు పూర్ణాతో ఎఫైర్ ఉన్న మాట నిజమే అన్నారు. అయితే ఎఫైర్‌ అంటే మరో విధంగా అనుకోవద్దని, ప్రతి దర్శకుడికి నటులతో అలాంటి అనుబంధాన్నే కలిగి ఉంటాడని ఇలాంటి అనుబంధం ఉండటమే వల్లే నటులతో మంచి నటన రాబట్టుకోగలుగుతామని, వారు మంచి ఔట్‌పుట్‌ ఇస్తారనేది రవిబాబు ఉద్దేశ్యం. ఇంకా పూర్ణ గురించి చెబుతూ, దర్శకుడు చెప్పేదాన్ని పూర్ణ.. రెండు వందల శాతం బెస్ట్ ఇస్తుందని వెల్లడించారు. ఆమె ప్రొఫేషనల్‌ యాక్టర్ అని తెలిపారు. మా ఇద్దరి కాంబినేషన్‌లో నాలుగు సినిమాలొచ్చాయని, సహజంగా ఎక్కువ సినిమాలు చేయడంతో ఇలాంటి ఎఫైర్లు వార్తలు వినిపిస్తుంటాయని, కానీ అందులో నిజం లేదనేది తెలిపారు.

Poorna Avanthika Movie Launch Stills - Latest Movie Updates, Movie ...

అలాగే “నా సినిమాలో హీరోయిన్‌ అంటే కేవలం పూర్ణానే అనుకుంటారు. కానీ ఆమె అన్ని సినిమాలకు ఓకే చెప్పదు. ఇటీవల నా కొత్త సినిమా ‘వాషింగ్ మెషీన్’ గురించి పూర్ణాను సంప్రదించాం. తనకు నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా నో చెప్పింది. తాను ఆ పాత్రకు సరిపోతాను అనుకుంటేనే నటిస్తుంది. నా కోసం అంగీకరించదు..” అని తెలిపారు రవిబాబు.

Read more RELATED
Recommended to you

Latest news