“దసరా పై ప్రశంసలు… డైరెక్టర్ ను ఆకాశానికెత్తేసిన రాజమౌళి !

-

గత వారమే థియేటర్ లలో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన దసరా మూవీ అద్భుతమైన కలెక్షన్ లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇందులో నాని మరియు కీర్తి సురేష్ లు నటించగా, ఓదెల శ్రీకాంత్ అనే డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలు, ప్రముఖులు అందరూ తమ స్పందనలు తెలియచేశారు. తాజాగా టాలీవుడ్ దర్శక దిగ్గజం పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దసరా గురించి తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.

రాజమౌళి మాట్లాడుతూ… నాని కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన మూవీ ఇదే అన్నారు. కీర్తి సురేష్ తనకు ఇచ్చిన పాత్రలో సరిగ్గా సూట్ అవ్వడమే కాక అద్భుతమైన ప్రదర్శన చేసింది అని కొనియాడారు. డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ గురించి చెబుతూ… మనసుకు హత్తుకునే ఒక మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీని అందించాడు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అంతే కాకుండా సినిమా విజయానికి కారణం అయిన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు రాజమౌళి.

Read more RELATED
Recommended to you

Latest news