సోషల్‌ మీడియాలో ‘సాయి’ పేరు వైరల్‌ అవడం వెనుక ఇంత పెద్ద స్కామ్‌ ఉందా..? అయ్యో సాయి !!

-

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక పేరు తెగ వైరల్‌ అవుతుంది.. రికార్డుల మీద పేరు ఉండటం కామన్‌.. కానీ ఆ పేరుకే రికార్డులు ఉన్నాయి.. అంత పాపులర్‌.. అమ్మాయిలైతే ఆ పేరుకు పడిపోతున్నారు.. సాయి సాయి సాయి.. అసలు ఇన్‌స్టాలో సాయి పేరును ఎంత వాడాలో అంత వాడేస్తున్నారు. పులిహోర రాజాగా, అమ్మాయిల కలల రాజుగా, స్మార్ట్‌ బాయ్‌గా..సాయి పేరును వాడిపడేస్తున్నారు. సాయి పేరు మీదే మీమ్స్‌, ట్రోల్స్‌..ఇక సాయి పేరు ఉన్న వాళ్లు అయితే.. అబ్బా అసలు ఈ టార్చర్‌ ఏంట్రా అనుకుంటున్నారు.. సరదాగా కాసేపు ఏవో రీల్స్‌ చూసుకుందాం అని ఇన్‌స్టా ఓపెన్ చేస్తే..మీ దోస్తుగాళ్లు అంతా..మీకు సాయి పేరుతో ఉన్న రీల్స్‌నే షేర్‌ చేస్తున్నారు.. అసలు సోషల్‌ మీడియాలో ఈ పేరు ఇంతలా పాపులర్‌ అవడానికి కారణం ఏంటి..? నిజంగానే సాయి పేరు ఉన్నవాళ్లు పులిహోరరాజాలా..? దీనికి వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసా..?

 

ఒక్కసారి ఇన్‌స్టా ఓపెన్ చేస్తే.. సాయి.. సాయి.. సాయి.. అంటూ మీమ్స్.. హాయ్ సాయి.. హలో సాయి.. సాయిగాడి గురించి నీకేం తెలుసు.. సాయి నన్ను వదిలేస్తున్నావా? సాయి తిన్నావా, సాయి ఏం చేస్తున్నావ్‌… ఇలా సాయి పేరు మీద ట్రోల్స్.. కనిపిస్తాయి. ఇన్ని కోట్ల జనాభాలో సాయి పేరు మీదే మీమ్స్ ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించరా? దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు.. చేసిన వీడియోలు కూడా ఇందుకు ఓ కారణం.

అసలు కారణం ఇదా..?

మీమ్ పేజీలు మెయింటేన్ చేసేవాళ్లు.. తాము పోస్ట్ వేస్తే.. ఎక్కువగా రీచ్ కావాలని కోరుకుంటారు. జనరల్‌గా గూగుల్‌ ఎనలటిక్స్‌ చూసుకుంటే.. జనాలకు బాగా తెలిసిన కీవోర్డ్‌ను మన కంటెంట్‌లో పెట్టామంటే.. దానికి బాగా ఎంగేజ్‌మెంట్‌ వస్తుంది.. పోస్ట్‌కు బాగా రీచ్‌ వస్తుంది.. వ్యూస్‌ పెరుగుతాయి. ఆంధ్రా, తెలంగాణలో సాయి అనే పేరు చాలా మందికి ఉంటుంది.. అంటే సాయి ట్యాగ్‌..పేరులో వెనకో ముందో సాయి అని ఉంటుంది.. సాయి ఆనంద్, సాయి భార్గవ్‌, మోహన్ సాయి, సాయిగోపాల్‌, సాయి ప్రకాష్‌, విజయ్‌ సాయి..ఇలా అనమాట.. మీ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లోనే ఒక్కసారి చూసుకోండి.. ఇలా సాయి ట్యాగ్‌ ఉన్నవాళ్లు ఎంత మంది ఉంటారో.. ఇప్పుడు సాయి పేరు మీద మీరు ఏదైనా ఫన్నీ మీమ్‌కానీ, రీల్‌ కానీ చేశారనుకోండి..లాస్ట్‌లో ట్యాగ్‌ దట్ సాయి అంటారు.. మీరు వెంటనే అది ఆ సాయికి షేర్‌ చేస్తారు… దాని వల్ల ఆ రీల్‌కు షేరింగ్స్‌, కమెంట్స్‌, లైక్స్‌, వ్యూస్ పెరిగిపోతాయి.. ఇవన్నీ పెరగడం వల్ల పోస్ట్‌ పెట్టినవాళ్లకే కదా లాభం.. అలా మీమర్స్ తెలివిగా సాయి అనే పేరును ఉపయోగించుకుంటున్నారు.. కానీ ఈ మొత్తం స్టోరీలో బలైపోయింది ఎవడ్రా అంటే..మళ్లీ ఆ సాయే.. పాపం..సోషల్‌ మీడియాలో సాయిపేరును రకరకాలుగా వాడేస్తున్నారు.. బయట ఎవరికైనా వాళ్లపేరు చెప్పాలంటే..వెంటనే ఏమనుకుంటారో అని చిన్న టెన్షన్‌ వచ్చేస్తుంది. సర్లే.. ఈ ఆర్టికల్‌ను కూడా ఆ సాయికి షేర్‌ చేసేయండి..!!

 

 

Read more RELATED
Recommended to you

Latest news