జూ ఎన్టీఆర్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!

-

రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లు ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళి ఈ సినిమా ను ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేస్తూ మరింత పేరు తీసుకొని వచ్చేలా చేస్తున్నాడు. దానితో రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లు హలీవుడ్ ప్రేక్షకులకు ఇపరీతంగా నచ్చుతున్నారు. అలాగే ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు రేసులో ముందుకు వెళుతూనే ఉంది.

లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ సినిమా వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ పాల్గొననున్నారు. దీని కోసం ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ టీంతో ప్రముఖ హాలీవుడ్ క్రిటిక్ కేటీ వాల్ష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అక్కడ సినిమా విశేషాల గురించి పాత్రికేయులు తో రాజమౌళి మరియు జూ ఎన్టీఆర్ లు చెప్పారు. ఇక ఈ మీట్ లో రామ్ చరణ్ టైమ్ కు అందుకోలేక హజరు కాలేదు.

ఇక రాజమౌళి జూ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి కొమరం భీముడో సాంగ్ గురించి చెబుతూ ఆ సాంగ్ లో ఎన్టీఆర్ నటన నా అన్ని చిత్రాలలో ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పాలి. ఇంత వరకు నేను అంత మంచి సీన్స్ నేను ఎప్పుడూ చేయలేదు  ఎన్టీఆర్ ఒక కంటి నొస మీద కెమెరా పెడితే… ఆ ఒక్క కంటి నొసతో యాక్టింగ్ చేయగలడు. ఎన్టీఆర్ అంత టాలెంటెడ్ అంటూ రాజమౌళి జూ ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news