హీరో రాజశేఖర్ ప్రస్తుతం శేకర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గరుడవేగ సినిమా హిట్ తరవాత రాజశేఖర్ కొత్త జోష్ తో మళ్ళీ తెరపైకి వస్తున్నారు. గరుడ వేగ తరవాత కల్కి వచ్చినా ఆశించిన విజయం సాధించలేకపోయింది. దాంతో మళ్ళీ రాజశేఖర్ ను ఓ హిట్ రావాలని అభిమానులు కోరుకున్నారు. ఇక శేకర్ సినిమా లుక్ రిలీజ్ కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

అదేవిధంగా ఎమ్.ఎల్ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ లో రాజశేఖర్ బైక్ పై కూర్చుని నెరిసిన గడ్డంతో కనిపిస్తున్నారు. యాంగ్రీ లుక్ లో రాజశేఖర్ కనిపిస్తుండటంతో ఈ సినిమా పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 25న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక శేకర్ ఫస్ట్ లుక్ అంచనాలు పెంచగా ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి.