మూడు రాజధానుల బిల్లులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం… వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే మూడు రాజధానుల చట్టం రద్దు తర్వాత… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ అసెంబ్లీలో ఏం ప్రకటన చేస్తారనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలల్లో ఉత్కంఠ నెలకొంది.
అయితే అమరావతి రాజధానిగా ఉంచుతారా..? లేదా కొత్తగా ఏం ప్రతిపాదిస్తారు అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓకే రాజధాని అమరావతి అంటూ ఇన్ని రోజులుగా రాజధాని రైతులు తిరుగులేని పోరాటం చేశారు. వారికి మద్దతుగా సీఎం జగన్ నిలుస్తారా ? అనే ఉత్కంఠత నెలకొంది. లేదా విశాఖ, అమరావతి ని రాజధానిగా చేస్తారా ? అనే సందేహం అందరిలోనూ ఉంది. అంతే కాదు అమరావతి మరియు కర్నూల్ ను రాజధాని చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం. అంటే ఏపీకి కచ్చితంగా రెండు రాజధానులు ఉండే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని నిమిషాలు ఆగాల్సిందే.